- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జై తెలంగాణ’ అనని సీఎం పాలన ఇది.. ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్
తెలంగాణ (Telangana) ఉద్యమ సిద్ధాంతకర్త, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, ఆంధ్ర పాలకులతో పరోక్ష యుద్ధం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (Professor Kathakali Jayashankar)కు ఘోర పరాభవం ఎదురైంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) ఉద్యమ సిద్ధాంతకర్త, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, ఆంధ్ర పాలకులతో పరోక్ష యుద్ధం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ (Professor Kathakali Jayashankar)కు ఘోర పరాభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla District) గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జయశంకర్ విగ్రహ ఏర్పాటు గద్దెను అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఆగస్టు 6న ఆయన జయంతి రోజున అవిష్కరించాలని నమాజ్ చెరువు కట్ట శివారులో విగ్రహ ఏర్పాటు పనులను ప్రారంభించగా.. అందుకు ఎలాంటి పర్మీషన్లు లేవని ఇరిగేషన్ శాఖ అధికారులు గద్దెను జేసీబీతో నేలమట్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే అధికారుల దుశ్చర్యపై తెలంగాణ జాగృతి వ్యవస్థపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆమె సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. నమాజ్ చెరువు కట్టపై జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేయడం దారుణమని ఆక్షేపించారు. ‘జై తెలంగాణ’ అనని ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ మహనీయులకు ఇలాంటి అవమానాలు జరగడం మనసును కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గంభీరావుపేటలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని.. నిర్ధాక్షిణ్యంగా గద్దెను కూల్చేసిన అధికారులపై కఠిన చర్యలను తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.






