చెత్త వేయోద్దంటే వేస్తున్నారు.. నగరంలో రోడ్లపై బ్యానర్ పెట్టిన మారని తీరు!

by Ramesh Naini |

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

చెత్త వేయోద్దంటే వేస్తున్నారు.. నగరంలో రోడ్లపై బ్యానర్ పెట్టిన మారని తీరు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రజలు చెత్తను బయట వేయకుండా, ఇంటింటికి వచ్చే స్వచ్ఛ ఆటోల ద్వారానే వ్యర్థాలను సేకరిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇష్టారీతిలో రోడ్లపై చెత్త వేస్తున్నారు. ఇలా తరచూ చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, హెచ్చరికల బోర్డులు పెడుతున్నారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో రోడ్లపై చెత్త దర్శనం ఇస్తూనే ఉంది. కొందరు మాత్రం జీహెచ్ఎంసీ హెచ్చరికలు, సూచనలు సైతం ఫాలో కావడం లేదు. ఈ క్రమంలోనే చెత్త వేస్తే రూ.1,000 నుంచి రూ.10,000 వరకు జరిమానాలు విధిస్తున్నట్లు బ్యానర్‌లో ప్రదర్శించినప్పటికీ, (Fateh Nagar Pipeline Road) ఫతే నగర్ పైప్‌లైన్ రోడ్డులో చెత్త పేరుకుపోతూనే ఉంది. చెత్త వేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు జీహెచ్ఎంసీని కోరారు. ఇందుకు సంబంధించిన ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా చెత్త వేసిన ఫోటోలు షేర్ చేశారు.

Next Story