- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Assembly : లగచర్ల ఘటన వెనుక ఉన్నది వారే : శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల(Telangana Assembly Sessions) చివరి రోజున సభలో వాడీ వేడీ చర్చలు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల(Telangana Assembly Sessions) చివరి రోజున సభలో వాడీ వేడీ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శాసనసభలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చినా రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టి భూసేకరణను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా లగచర్ల ఘటన(Lgacharla Incident) వెనుక ఉన్నది బీఆర్ఎస్ నేతలే(BRS Leaders) అని, వారు రెచ్చగొట్టడం వల్లే రైతులు ప్రభుత్వ అధికారుల మీద దాడులకు దిగారు అని అన్నారు. ఫార్మా కంపెనీల వలన స్థానికులకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయని తెలిసినా కావాలని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నియోజకవర్గం అభివృద్ధి చెందకూడదు అనేదే వారి లక్ష్యం అని, అందుకోసం పెద్ద కుట్ర చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న ప్రతీ అంశాన్ని అమలు చేసుకుంటూ వెళతామని.. అసలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. ఇక ఇదే అంశంపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఫార్మసీటీ కోసం రైతులను బెదిరించి బలవంతంగా వారినుంచి భూములు లాక్కున్నారని.. ఒకేచోట 144 ఫార్మా కంపెనీలు వస్తాయని గాలిలో మేడలు కట్టరాని ఎద్దేవా చేశారు. కాని అపుడు మేము ప్రతిపక్ష నేతలుగా ఫార్మాసిటీని వ్యతిరేకించలేదని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు.






