- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశ భద్రతపై సమగ్ర చర్చ జరగాల్సిందే.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్
దేశం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. కేవలం 15 రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం సమంజసం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. కేవలం 15 రోజులు మాత్రమే పార్లమెంటు సమావేశాలు నిర్వహించడం సమంజసం కాదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy అన్నారు. ఇవాళ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ముందు ఆయన ఢిల్లీ (Delhi)లో మాట్లాడుతూ.. దేశ భద్రతపై ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ జరగాలన్నారు. ఢిల్లీ ఎర్రకోట దగ్గర బాంబు బెదిరింపు ఘటన జరిగితే కేంద్ర హోంశాఖ ఏం చేస్తోందని మండిపడ్డారు. ఎస్ఐఆర్ (SIR) పేరిట ప్రజల ఓటు హక్కును కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ఆఫ్ పీపుల్, సెక్యూరిటీ ఆఫ్ డెమోక్రసీపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో సెక్యూరిటీ ఆఫ్ హెల్త్ పై సభలో విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని చామల అన్నారు. తాను ఢిల్లీలో అడుగుపెట్టిన సమయంలో AQI లెవెల్ 272 ఉందని.. వారం రోజుల క్రితం ఢిల్లీలో AQI 390 దాటిందని అన్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రముఖ నగరాలు కాలుష్య బారిన పడుతుండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తమకు ఇష్టమున్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారని.. మిగిలిన రాష్ట్రాలు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పంటలు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను ‘మమా’ అనిపించేలా ఎన్డీఏ (NDA), బీజేపీ (BJP) ప్రభుత్వం చూస్తోందని.. ప్రజా సమస్యలపై విపక్ష పార్టీల ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.






