ఆర్టీసీ సమ్మేపై సర్వత్రా ఉత్కంఠ.. యాజమాన్యం నుంచి JAC నేతలకు పిలుపు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-21 10:47:34  IST  )

ఆర్టీసీ జేఏసీ నేతలకు యాజమాన్యం నుంచి చర్చలకు పిలుపు అందింది. ఈడీ వెంకన్న, సీపీఎం ఉషాదేవి నేతలతో ఫోన్‌లో మాట్లాడారు.

ఆర్టీసీ సమ్మేపై సర్వత్రా ఉత్కంఠ.. యాజమాన్యం నుంచి JAC నేతలకు పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జేఏసీ (JAC) నాయకులతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు చర్చలకు రావాల్సిందిగా జేఏసీ నేతలకు సమాచారం అందించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) వెంకన్న, ఆర్టీసీ సీపీఎం (CPM) ఉషాదేవి స్వయంగా జేఏసీ నాయకులకు ఫోన్ చేసి చర్చలకు పిలిచారు. కార్మికుల డిమాండ్లు, సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే, చర్చలకు సంబంధించిన ఖచ్చితమైన సమయం, వేదికను మరికొద్ది‌సేపట్లో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు నాయకులందరూ అందుబాటులో ఉండాలని ఆర్టీసీ యాజమాన్యం జేఏసీకి సూచించింది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు తాజా చర్చలతో కొలిక్కి వస్తాయని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మీకులు సమ్మేకే మొగ్గు చూపితే.. ప్రత్యామ్నాయం ఏమిటా అని ప్రజలు గుబులు పడుతున్నారు.

RTC కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు

Next Story