- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ అభివృద్ధిలో వ్యత్యాసాలు ఉన్నాయి.. ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ (Hyderabad) ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందినా.. అభివృద్ధిలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) ప్రపంచ స్థాయి నగరంగా గుర్తింపు పొందినా.. అభివృద్ధిలో మాత్రం చాలా వ్యత్యాసాలు ఉన్నాయని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ వర్షాలు వచ్చిన సందర్భంగా నగరంలో అతలాకుతలం అవుతోందని కామెంట్ చేశారు. డ్రైనేజ్ సిస్టమ్ (Drainage System) సరిగా లేక నాలాలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని, దీంతో నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
హైదరాబాద్ నగరంలో 100 శాతం మురుగునీటిని శుద్ధి చేయాలనే లక్ష్యంతో STP (Sewage Treatment Plant)లను ఏర్పాటు చేసినా.. అవి సక్రమంగా పని చేయడం లేదని అన్నారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో నగర శివార్లలో నిరుపేదల కోసం డబుల్ బెడ్‌రూంలను నిర్మించారని.. అక్కడ మాత్రం మౌలిక వసతులు కల్పించలేదని, వెంటనే ఆ పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎక్కడికైనా.. ఎందాకైనా వెళ్తానని ఈటల రాజేందర్ అన్నారు.






