Theft of chilli : మిర్చి రైతుల దిగుబడుల దొంగతనం

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-03-02 11:19:53  IST  )

ఆరుగాలం శ్రమించి అనేక వ్యయప్రయాసలు భరించి రైతులు పండించిన పంటను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లడం బాధిత రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది.

Theft of chilli : మిర్చి రైతుల దిగుబడుల దొంగతనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆరుగాలం శ్రమించి అనేక వ్యయప్రయాసలు భరించి రైతులు పండించిన పంటను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లడం బాధిత రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేసింది. ప్రకాశం జిల్లా(Prakasam District)లో త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలో రైతు పండించిన మిరప పంట(Theft of chilli) ను దొంగలు ఎత్తుకెళ్లారు.

మూడు ఎకరాలలో పండించిన మిరపకాయలు కోసి ఆరబెట్టెందుకు రైతు కుప్పగా పోశాడు. అలా ఆరబోసిన 30 క్వింటాల మిరపకాయల(30 Quintals of Chillies)ను దొంగలు రాత్రి వేళ ఎత్తుకెళ్లారు. ఉదయమే కల్లం వద్ధ ఆరబోసిన పంట వద్ధకు వెళ్లి చూడగా..మిర్చి దిగుబడులు లేకపోవడంతో ఖంగుతిన్న రైతు లబోదిబోమంటు పోలీసులను అశ్రయించాడు.

ఎక్కువగా వ్యవసాయ మోటార్లు, విద్యుత్తు వైర్లు, ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైర్లు, పశువులను ఎత్తుకెళ్లే దొంగలు అడపదడపా పండించిన పంటలను కూడా ఎత్తుకెళ్లుతుండటంతో రైతులు షాక్ కు గురవుతున్నారు.


Next Story