- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపారని యువకుని ఆత్మహత్యాయత్నం
by Muthe.Rajitha |
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు సాధారణ వాహన తనిఖీలు చేస్తున్నారు. అటుగా వచ్చిన ఓ వాహనదారుడిని ఆపి పత్రాల గురించి పోలీసులు అడగగా.. వారితో ఆ యువకుడు గొడవపడ్డాడు. సరైన పత్రాలు లేకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించడంతో.. ఆగ్రహించిన యువకుడు నన్నే బెదిరిస్తారా అంటూ.. బైక్ లోని పెట్రోల్ తీసి ఒంటిమీద పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన యువకుడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్చి, కేసు నమోదు చేసుకున్నారు.
Next Story






