- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Tummala : మార్చికల్లా లక్ష ఎకరాల అయిల్ పామ్ లక్ష్యం పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల
మార్చికల్లా లక్ష ఎకరా(One lakh acres)లలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్(Oil palm Plantation)లక్ష్యాన్ని పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao)అధికారులను ఆదేశించారు.

దిశ, వెబ్ డెస్క్ : మార్చికల్లా లక్ష ఎకరా(One lakh acres)లలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్(Oil palm Plantation)లక్ష్యాన్ని పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao)అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పథకాల అమలుపై రాష్ట్రస్థాయి అధికారులతో సచివాలయంతో తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పథకాల పురోగతిపై అధికారులు వివరాలు సమర్పించారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ పథకాల అమలు వేగవంతం చేసి, ఈ ఆర్థిక సంవత్సరములో అధిక మొత్తంలో రైతులకు లబ్ధి చేకూర్చాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక సహాకార సంఘాల బలోపేతం, పునర్వవస్థీకరణ గురించి ఆయన అధికారులకు దిశానిర్ధేశం చేశారు. గత ప్రభుత్వకాలంలో జరిగిన పొరపాట్లను పునరావృతం కానియకుండా కేంద్ర ప్రభుత్వం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా సూచించారు.






