- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళే సుప్రీంకోర్టులో విచారణ.. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ
తెలంగాణ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో జరుగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)లో జరుగనుంది. బీఆర్ఎస్(BRS) పార్టీలో గెలిచి కాంగ్రెస్(Congress ) పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం ఇవాళ విచారణ జరపనున్నది. గత విచారణ సందర్భంగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎంత సమయం కావాలని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణకు ఎంత సమయం పడుతుందో స్పీకర్ చెప్పకపోతే, తామే నిర్ణయించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా? అని మళ్లీ కోర్టు ప్రశ్నించింది. ఇప్పటికే 10 నెలలు పూర్తయింది, ఇది రీజనబుల్ టైం కాదా.. సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. దీంతో ఇవాళ విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఏం తీర్పు వెలువరిస్తుందో అని ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
బీఆర్ఎస్‌లో గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు
1. దానం నాగేందర్,
2. కడియం శ్రీహరి
3. తెల్లం వెంకట్రావు,
4. పోచారం శ్రీనివాస్ రెడ్డి
5. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
6. కాలే యాదయ్య
7. టి. ప్రకాష్ గౌడ్
8. అరికపూడి గాంధీ
9. గూడెం మహిపాల్ రెడ్డి
10. ఏం సంజయ్ కుమార్






