- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : రాష్ట్రానికి నా సేవలు అవసరం లేదేమో : కవ్వంపల్లి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మంత్రి విస్తరణ(Telangana Cabinet Expansion) తర్వాత అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మంత్రి విస్తరణ(Telangana Cabinet Expantion) తర్వాత అసంతృప్తులంతా ఒక్కొక్కరుగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మానుకొండూరు ఎమ్మెల్యే, మాదిగ సామాజిక వర్గానికి చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Kavampalli Satyanarayana) కూడా తన నిరసన గళాన్ని వినిపించారు. కవ్వంపల్లికి మంత్రి పదవి వస్తుందని చివరి నిముషం వరకు ఎంతో ఆశగా ఎదురు చూడగా.. ఆఖరుకు ఆ పదవి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు వెళ్ళింది. దీనిపై నేడు కవ్వంపల్లి దంపతులు తీవ్రంగా స్పందించారు. తమను తొక్కేసామని కొందరు సంతోషపడుతున్నారని, అయితే కవ్వంపల్లి ఎంత తొక్కితే అంత పైకి ఎదుగుతారని ఆయన సతీమణి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇక సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో నా సేవలు అవసరం లేదని ఆ దేవుడు భావించాడేమో, అందుకే తనకు మంత్రి పదవి దక్కలేదని నిరాశను వెల్లడించారు. అయితే కవ్వంపల్లికి మంత్రి పదవి రాకపోవడం వెనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రితోపాటు, మరో ఎమ్మెల్యే చక్రం తిప్పారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.






