- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ ప్రభుత్వం.. రూ. 2 వేల కోట్లు విడుదల
తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రేవంత్ ప్రభుత్వం తొలి విడతగా రూ. 2,000 కోట్ల బకాయిల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిల చెల్లింపునకు రూ.2 వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగుల సుదీర్ఘకాల బకాయిలను కేవలం 100 రోజుల్లో రూ.6,000 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ (JAC) నాయకులకు ఇటీవల స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈరోజు తొలి విడతగా రూ.2,000 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
వందశాతం క్లియర్:
ఈరోజు విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిల మొత్తాన్ని వంద శాతం క్లియర్ చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించారు. ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైంది. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4,000 కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ శ్రద్ధ మరియు శరవేగ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.






