ఖురాన్ మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది.. ముస్లింలకు రంజాన్ విషెస్ చెప్పిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

by Kema Shiva Kumar |

రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ముస్లింలకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.

ఖురాన్ మనిషిని సన్మార్గంలో నడిపిస్తుంది.. ముస్లింలకు రంజాన్ విషెస్ చెప్పిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
X

దిశ, వెబ్‌డెస్క్: పవిత్ర రంజాన్ (Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఖురాన్ బోధనల విశిష్టతను కొనియాడారు. పవిత్ర ఖురాన్ బోధనల పట్ల తనకు ఎంతో గౌరవం, భక్తి ఉన్నాయని పేర్కొన్నారు. ఖురాన్ మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని, మానవత్వం, కరుణకు అది ఒక గొప్ప మార్గదర్శి అని ఆయన కొనియాడారు. రంజాన్ పండుగ సమాజంలో శాంతి, సోదరభావాన్ని మరింత పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ప్రార్థనలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు.

Next Story