- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హబీబ్ నగర్ 'బాలిక కిడ్నాప్' కేసును.. 'డ్రామా' గా నిర్ధారించిన పోలీసులు!
హైదరాబాద్ నగరంలో గత కొన్నినెలలుగా బాలికలు కిడ్నాప్ కు గురవుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను బయటకి పంపించాలంటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో గత కొన్నినెలలుగా బాలికలు కిడ్నాప్ కు గురవుతున్న ఘటనలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను బయటకి పంపించాలంటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే నిన్న శుక్రవారం ఆగస్టు 9 న రాత్రి సమయంలో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలిక, కిడ్నాప్ కు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజం ఒకటి తెలిసింది. అదేంటంటే.. హబీబ్ నగర్ కు సమీపంలోని అఘాపురాలో బాలిక తన తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. నిన్న రాత్రి సమయంలో అక్కడ కరెంట్ పోవడంతో, అదే సమయానికి అక్కడికి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి చొరబడి తనను కిడ్నాప్ చేసినట్లు చెప్పింది. తర్వాత సమయస్ఫూర్తితో తనను పట్టుకున్న నిందితుడి చేతిని గట్టిగా కొరికి చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకున్నట్లు బాలిక పోలీసులతో చెప్పింది. అయితే ఇదంతా ఒక కట్టు కథ అని, పోలీసుల దర్యాప్తులో తేలింది. బాలిక తాను లేటుగా ఇంటికి వెళ్తే.. తన తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి, ఇంటికి వెళ్లకుండా నాంపల్లి వైపుగా నడుచుకుంటూ వెళ్లిందని, సీసీ కెమెరాలను పరిశీలించగా తెలిసింది. ఇదే విషయాన్ని పోలీసులు ధృవీకరించి, ఆ సీసీ కెమెరాలో బాలికతో పాటూ ఎవరూ లేరని తేల్చారు. అయితే చివరకి బాలిక కిడ్నాప్ కాలేదని తేలడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.






