- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీల్డ్ కవర్‌లో మారిన వైస్ చైర్మన్ అభ్యర్థి పేరు.. కేటీఆర్ ఇలాకాలో రచ్చరచ్చ
సిరిసిల్ల మున్సిపల్ ప్రమాణ స్వీకారంలో హైడ్రామా నెలకొంది. కేటీఆర్ ప్రకటించిన పేరు మాయమై.. సీల్డ్ కవర్‌లో మరో నేత పేరు రావడంతో ఉద్రిక్తత నెలకొంది

దిశ, వెబ్‌డెస్క్: రాజన్న సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లా కేంద్రంలో ఇవాళ జరిగిన మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ (KCR) ప్రకటించిన పేరుకు, సీల్డ్ కవర్‌లో వచ్చిన పేరుకు మధ్య పొంతన లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం పార్టీ సీనియర్ నాయకుడు బుర్రా నారాయణ (Burra Narayana) పేరును కేటీఆర్ స్వయంగా ఇటీవలే ఖరారు చేసి ప్రకటించారు. దీంతో ఆయన అనుచరులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
అయితే, ప్రమాణ స్వీకార సమయానికి వచ్చిన సీల్డ్ కవర్‌ను అధికారులు విప్పగా.. అందులో చైర్మన్‌గా కళా చక్రపాణి, వైస్ చైర్మన్‌గా సందీప్ పేరు ఉండటంతో అందరూ అవాక్కయ్యారు. అయితే, తమ నాయకుడి పేరును వైస్ చైర్మన్‌గా ప్రకటించి తీరా ఎన్నిక సమయంలో మార్చడంపై బుర్రా నారాయణ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కార్యకర్తలను వంచించడమేనని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.






