- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం.. కడియం శ్రీహరికి మరోసారి స్పీకర్ నోటీసులు
ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) అనర్హత పిటిషన్‌పై రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో విచారణ జరగనుంది. ఈ మేరకు విచారణ షెడ్యూల్‌ను స్పీకర్ ప్రసాద్ కుమార్, కడియం శ్రీహరికి మరోసారి పంపిన నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. విచారణకు హాజరుకావాలని అసెంబ్లీ సెక్రటరీ నుంచి కడియంకు నోటీసులు కూడా అయ్యాయి. అదేవిధంగా, అనర్హత పిటిషన్ దాఖలు చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. మొదట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే వివేకానంద వాదనలను నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది.
కాగా, 2025 నవంబర్ 20న స్పీకర్ ప్రసాద్ కుమార్ కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తన నోటీసులకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కానీ, కడియం తనకు వచ్చిన నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను అభ్యర్థిస్తూ లేఖ రాశారు.






