- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Cm Revanth Reddyకి రెండో విజయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly Elections)ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఇప్పుడు జూబ్లీహిల్స్(Jubileehills) ఫలితం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. పలు అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా పాలన సాగిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎంగా అన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చారు. మిగిలినవి భవిష్యత్తులో తీర్చాల్సి ఉంది.
అయితే సీఎంగా అధికారం చేపట్టిన సమయంలో ఆయన్ను పలు సవాళ్లు స్వాగతం పలికాయి. చాలా సమస్యలు ఎదురయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, వడ్డీలు, అభివృద్ధి, సంక్షేమంతో పాటు గత ప్రభుత్వ తప్పిదాలు వంటి అంశాలకు ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీటన్నింటిని అధిగమించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇంతలో రాష్ట్రంలో జరిగిన సంఘటన ఆయనకు ఎదురైంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణించారు. ఆ స్థానంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. అధికారంలోకి వచ్చి కొద్ది రోజుల్లోనే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఎన్నికలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు జరగడంతో అది ఆయనకు తొలి విజయంగా అంతా చెప్పుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివంగత గోపీనాధ్ అకాల మరణంలో అక్కడ కూడా ఎన్నికలు అనివార్యమైంది.
కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ తరపున గోపీనాథ్ సతీమణి పోటీ చేశారు. రేవంత్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన పాలనకు ఇది రెండో మెట్టుగా మారింది. అయితే జూబ్లీహిల్స్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రేవంత్ పాలనపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. అయినా సరే రేవంత్ రెడ్డి మొక్కవోని దీమాతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను ప్రకటించి పోటీకి కావాల్సిన దిశానిర్దేశం చేశారు. స్వయంగా ఆయనే వచ్చి జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ మేరకు ప్రజలు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించారు. అయితే ఈ విజయం సైతం రేవంత్ రెడ్డికి సీఎంగా రెండో విజయంగా మారింది. ఇప్పుడు అందరి చూపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే ఉంది. ఈ ఎమ్మెల్యేల స్థానంలో కూడా ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డికి మరో టాస్క్ అవుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇదే జరిగితే రేవంత్ రెడ్డికి మూడో టాస్క్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడాలి మరీ తెలంగాణ భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో.






