- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్ర చలిగాలుల తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతుండగా.. ఈ రోజు ఉదయం మరింత పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతుండగా.. ఈ రోజు ఉదయం మరింత పెరిగింది. హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. HCU–శేర్లింగంపల్లి అత్యల్పంగా 9.8°c నమోదు కాగా, BHEL 11.1°C, రాజేంద్రనగర్ 11.6°C, గచ్చిబౌలి 11.9°C వద్దకు పడిపోయాయి. కుత్బుల్లాపూర్, వెస్ట్ మేరెడ్‌పల్లి, గాజులరామారం, చందానగర్, ఎల్‌బీ స్టేడియం, జూ పార్క్ వంటి ప్రాంతాల్లో 12.5°C నుండి 13.9°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని కొన్ని కాలనీలు పొగమంచు కారణంగా ఉదయం తీవ్ర చలితో వణికిపోయాయి.
అలాగే తెలంగాణ లోని వివిధ జిల్లాల స్థాయిలో కూడా చలి దాడి కొనసాగింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పుడుతున్నారు. వాతావరణ శాఖ డేటా ప్రకారం ఈ రోజు ఉదయం.. సంగారెడ్డి 8.1°C తో అతి చల్లటి ప్రాంతంగా నిలించింది. అలాగే ఆసిఫాబాద్ 8.4°C, సిద్ధిపేట్–కామారెడ్డి 8.9°C, సిరిసిల్ల 9°C, మెదక్–ఆదిలాబాద్ 9.6°C వద్దకు పడిపోయాయి. రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల లో కూడా 10°C చుట్టూ ఉష్ణోగ్రత నమోదవడంతో రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు మరింత పెరిగాయి. వాతావరణ శాఖ వచ్చే 48 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.






