మాజీ మంత్రి హరిష్ రావు అరెస్ట్ పై హైకోర్టు కీలక నిర్ణయం

by Muthe.Rajitha |

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరిష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను వచ్చే బుధవారం వరకు అరెస్ట్ చెయ్యవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారి చేసింది.

మాజీ మంత్రి హరిష్ రావు అరెస్ట్ పై హైకోర్టు కీలక నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో : పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరిష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను వచ్చే బుధవారం వరకు అరెస్ట్ చెయ్యవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారి చేసింది. తన పై నమోదైన కేసును కొట్టివేయాలంటు హరిష్ రావు , రాధాకిషన్ రావు హై కోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ పాల్పాడ్డరని కాంగ్రెస్ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఛక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరిష్ రావుతో పాటు రాధాకిషన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను వచ్చే బుధవారానికి వాయిదా హైకోర్టు వాయిదా వేసింది.

Next Story