ఈసారి బతుకమ్మ చీరల ప్రత్యేకత ఇదే

by Disha Web Desk 2 |
ఈసారి బతుకమ్మ చీరల ప్రత్యేకత ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనిని 'రాష్ట్ర పండుగ'గా ఖరారు చేసి అత్యంత ఘనంగా జరుపుతోంది. తాజాగా.. పండుగ సమీపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు షురూ చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుకగా ఇచ్చే 'బతుకమ్మ చీరల' పంపిణీకీ రంగం సిద్ధం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు చీరలు పంపిణీ చేయనున్నారు. అంతేగాక, ఆగస్టు 22వ తేదీనుంచే 1.10 కోట్ల చీరలను జిల్లాలకు చేరవేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి బతుకమ్మ చీరలకు ప్రత్యేకంగా డాబీ అంచు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed