- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: అసెంబ్లీలో కీలక తీర్మానాలు చేసిన ప్రభుత్వం
అసెంబ్లీలో ప్రభుత్వం కీలక తీర్మానాలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం అన్ని అనుమతులు ఇవ్వాలని తీర్మానించింది.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ప్రభుత్వం కీలక తీర్మానాలు చేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం అన్ని అనుమతులు ఇవ్వాలని తీర్మానించింది. గోదావరి జలాల తరలింపునకు ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దనీ తీర్మానం చేసింది. అంతకుముందు మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక పంపు ఆన్ చేసి ఆపేశారని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ రూ.26,262 కోట్లు ఖర్చుచేయగా అది మొత్తం అంచనాతో 32 శాతమే అని, అయినా ఇంకా 39 వేల ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని స్పష్టం చేశారు. 2016లో శంకుస్థాపన చేసినప్పుడు మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేస్తామని కేసీఆర్ ప్రకటించారని, కానీ ఇప్పటికీ కేవలం 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. కేసీఆర్ కుర్చీ వేసుకుని ప్రాజెక్టు కట్టిస్తానని చెప్పారని, కానీ ఆ కుర్చీ ఏడ పోయిందో, ఆయన ఎటుపోయారో తెలియదని ఎద్దేవా చేశారు. ఆయకట్టు కాలువల పనులు, భూసేకరణ లేకుండా రూ.55 వేల కోట్లతో సీడబ్ల్యూసీకి డీపీఆర్‌ను సమర్పించారని, కానీ.. ప్రస్తుత అంచనాల మేరకు ఈ ప్రాజెక్టు పూర్తికావాలంటే రూ.84 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.






