- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్.. 250 కోట్ల నిధులు రిలీజ్
by Prasad Jukanti |
గ్రామ పంచాయతీలకు రూ.250 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు (Gram Panchayats) తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) తీపి కబురు చెప్పింది. పంచాయతీలకు రూ. 250 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఇవాళ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడతగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 387 కోట్లను విడుదల చేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులు వెచ్చించాలని సూచించింది. అయితే 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి సుమారు రూ. 3000 కోట్లు రావాల్సి ఉంది.
Next Story






