- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసెంబ్లీలో ‘సన్నబియ్యం’ ఘుమఘుమలు.. విందు ఆరగించిన సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి భోజనం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని డైనింగ్ హాలులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలకు సన్నబియ్యంతో ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేషన్ షాపుల ద్వారా సామాన్యులకు అందుతున్న అదే నాణ్యమైన బియ్యంతో వండిన పదార్థాలను ప్రజాప్రతినిధులందరికీ వడ్డించారు. ఈ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని, మంత్రులు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే (MLA's)లు, ఎమ్మెల్సీ (MLC's)లతో కలిసి సన్నబియ్యం భోజనం చేశారు. అనంతరం వారు సన్నబియ్యం విందు భలే బాగుందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కితాబిచ్చారు. పేదలకు అందుతున్న బియ్యం నాణ్యత ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా ఆయన స్వయంగా పరిశీలించారు. ఇక సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.






