TG News : ఈటల వాస్తవాలు బయట పెట్టలేదు : చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Muthe.Rajitha |

కాళేశ్వరం విచారణ కమిషన్(Kaleswaram Commission) ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eetala Rajendar) వాస్తవాలు దాచారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala kiran Kumar Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు.

TG News : ఈటల వాస్తవాలు బయట పెట్టలేదు : చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం విచారణ కమిషన్(Kaleswaram Commission) ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్(Eetala Rajendar) వాస్తవాలు దాచారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala kiran Kumar Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈటల నిజాలు చెప్పి ఉంటే గౌరవం ఉండేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్‌కు కేబినెట్ ఆమోదంతో జరిగిందని అన్నారని, వాస్తవానికి దాని డిజైనింగ్ అంతా ఎవ్వరి ప్రమేయం లేకుండా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే జరిగిన విషయం చెబితే బాగుండు అని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులకు స్వతంత్ర నిర్ణయాధికారం లేదని, ఈటల ఆర్థిక మంత్రిగా నామమాత్రంగానే ఉన్నారని ఆరోపించారు.

జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు, ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతోంది. అందులో భాగంగా అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను విచారించేందుకు కమిషన్ నోటీసులు జారీ చేయగా.. ఆయన నేడు కమిషన్ ముందు గంటన్నర పాటు హాజరై.. తన వాంగ్మూలం ఇచ్చారు. కేసీఆర్, హరీశ్ రావులు కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు.

Next Story