సంస్కారానికి, అహంకారానికి ఉన్న తేడా.. బగ్గుమంటున్న నెటిజన్లు

by Ramesh Goud |
సంస్కారానికి, అహంకారానికి ఉన్న తేడా.. బగ్గుమంటున్న నెటిజన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజుల్లో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎక్కువ రాజకీయాలపై స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల సీఎంలను పోల్చుతూ.. నెటిజన్లు తెగ ఫైర్ అవుతున్నారు. ఇటీవలే పద్మ విభూషన్ ప్రకటించబడిన ప్రముఖ నటుడు చిరంజీవి వద్ద వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల ప్రజలు తెగ కామెంట్లు పెడుతున్నారు.

గతంలో చిరంజీవి సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై విన్నవించుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసినప్పుడు ఆయన వ్యవహరించిన తీరుపై జనాల్లో తీవ్ర వ్యతిరేఖత వచ్చింది. సమస్యలపై ఒక నటుడు, మాజీ కేంద్రమంత్రి చేతులు జోడించి అడుగుతుండగా.. జగన్ నవ్వుతూ చూస్తున్నాడు. అదే చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు, ఇద్దరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం, చిరంజీవి సమస్యలపై విన్నవించినప్పుడు సానుకూలంగా స్పందించడం లాంటివి జరిగాయి.

దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలను పోల్చుతూ.. నెటిజన్లు సీఎం జగన్ పై బగ్గుమంటున్నారు. అంతేగాక, ప్రజాబలంతో, స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి సంస్కారం ఇలా ఉంటే.. తండ్రి చనిపోయన సెంటిమెంట్ తో వచ్చిన లాటరీ పదవి అనుభవించే జగన్ అహంకారం అలా ఉంది అంటున్నారు. ఇది ఒక్కటే కాదు జగన్ అహంకారానికి అద్దం పట్టే సంఘటనలు చాలానే ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story