సార్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి.. సీఎంకు కాంట్రాక్ట్ లెక్చరర్ల లేఖ

by Javid Pasha |
CM KCR Likely to Visit Bihar On August 13
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమ బద్దీకరించడంలో సీఎం జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఎంకు ఆన్లైన్ లో వినతి పత్రం పంపించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చర్స్ అసోసియేషన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా.వి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కొప్పిశెట్టి సురేష్ తెలిపారు. 23 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 474 కాంట్రాక్ట్ లెక్చరర్లు, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 577 కాంట్రాక్టు లెక్చరర్లు నేటికీ క్రమబద్ధీకరణ కాలేదని వారు తెలిపారు.

అధికారులు పోస్ట్ సాంక్షన్ లేవని, సరైన విద్య అర్హతలు లేవని, అవార్డు ఫాస్ట్ డివిజన్ లాంటి, కారణాల చూపుతూ, వీరి తప్పు లేనప్పటికీ నేటికీ క్రమబద్దీకరణ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు కాంట్రాక్టు లెక్చరర్ గా చదువు చెప్పేటప్పుడులేని సమస్యలు క్రమబద్దీకరణ విషయంలో ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని వారు ప్రశ్నించారు. సీఎంకు అలాగే మంత్రులు, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలకు వినతిపత్రం సమర్పించినా క్రమబద్ధీకరణ విషయంలో ఇంతవరకు ఫలితం కలగలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed