దుమారం రేపుతోన్న కాంగ్రెస్ పోల్.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ కౌంటర్

by Gantepaka Srikanth |

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధికారిక ట్విట్టర్(X) ఖాతాలో రాష్ట్రంలో ఫాంహౌజ్ పాలన(Farmhouse Rule) కావాలా? ప్రజల వద్దకు పాలన(People Rule) కావాలా? అని పోల్ పెట్టిన విషయం తెలిసిందే.

దుమారం రేపుతోన్న కాంగ్రెస్ పోల్.. బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ నేత స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) అధికారిక ట్విట్టర్(X) ఖాతాలో రాష్ట్రంలో ఫాంహౌజ్ పాలన(Farmhouse Rule) కావాలా? ప్రజల వద్దకు పాలన(People Rule) కావాలా? అని పోల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. అనూహ్యంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మెజారిటీ నెటిజన్లంతా ఫాంహౌజ్ పాలన కావాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సోసల్ మీడియా వేదికగా కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రజల వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడని.. ప్రజలు మళ్లీ కేసీఆర్(KCR) పాలనే కోరుకుంటున్నారని పోస్టులు పెడుతున్నారు.

తాజాగా.. బీఆర్ఎస్(BRS) నేతలకు కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే సతీష్(Manne Sathish) కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ పోల్ రిజల్ట్స్‌‌ను బీఆర్ఎస్ సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అసలు రూపం తెలుసుకోవడం కోసమే తాము ఈ పోల్ పెట్టామని అన్నారు. పోల్ ద్వారా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం ప్రజలకు తెలిసిపోయిందని వెల్లడించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అమెరికా నుండి నడుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రాడ్ యూజర్స్‌తో ఫామ్ హౌస్ పాలన కావాలని టాగ్ చేశారు. కేవలం పరిపాలన విధానం గురించి పోల్ చేసామని అన్నారు.

ప్రజల వద్ద పరిపాలన ఉండాలా?, ఫాంహౌస్ పాలన ఉండాలా? అనే పోల్‌తో ఏ నాయకుడికి సంబంధం లేదని అన్నారు. సమాజం పట్ల బాధ్యత ఉన్నవారు ఎవరూ ఫాంహౌస్ పాలన కావాలని కోరుకోరు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలనే నకిలీ ఖాతాల ద్వారా డబ్బులిచ్చి నెటిజన్ల చేత ఫాంహౌజ్ పాలన కావాలని రియాక్ట్ అయ్యేలా చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కొంతం దిలీప్ ప్రభుత్వ డబ్బులు 13 కోట్లు ఖర్చు పెట్టాడని విమర్శించారు. కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీ లైన్‌లో మా సోషల్ మీడియా పని చేస్తోందని చెప్పారు. లేదంటే బీఆర్ఎస్ సోషల్ మీడియాను తొక్కుతం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా పెయిడ్ వ్యక్తులు అని మండిపడ్డారు.

కాగా, ఆ పోల్‌లో ఇప్పటివుకు 70శాతం మంది A ఆప్షన్‌పై క్లిక్ చేయగా.. 30 శాతం మంది కాంగ్రెస్ వైపు ఓటేశారు. ఇందుకు సంబంధించిన స్కీ్న్ షాట్స్‌ను బీఆర్ఎస్ వైరల్ చేస్తోంది. ఇది ప్రభుత్వ పనితీరు అంటూ విమర్శలు చేస్తోంది. దొరల ఫాం హౌస్ బాట్ (BOT) యూజర్ల కారణంగానే తాము పెట్టిన పోల్‌కు ఇలాంటి ఫలితం వచ్చిందని కాంగ్రెస్ నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు.

Next Story