- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంజీరా ఉగ్రరూపం.. పూర్తిగా మునిగిపోయిన ఏడుపాయల పుణ్య క్షేత్రం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుండి రాష్ట్రంలోని పలు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజుల నుండి రాష్ట్రంలోని పలు జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మెదక్‌లో కురుస్తున్న వర్షాలకు మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నదిని ఆనుకుని ఉన్న ఏడుపాయల పుణ్యక్షేత్రం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.
నది ఉధృతి పెరగటంతో దేవాలయం పై వరకు వరద నీరు చేరింది. దీంతో ప్రజలు ఆలయం వైపునకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లాల్లో కొన్ని గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. దీంతో జిల్లాలో సహాయకచర్యలు చేపడుతున్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.






