కేసీఆర్ కు కమిషన్ 18 ప్రశ్నలు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-11 12:52:18  IST  )

బీఆర్ఎస్ చీఫ్(BRS Cheif) మాజీ సీఎం కేసీఆర్(KCR) నేడు కాళేశ్వరం విచారణ కమిషన్(Kaleswaram Inquiry Commission) ముందు హాజరైన సంగతి తెలిసిందే.

కేసీఆర్ కు కమిషన్ 18 ప్రశ్నలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ చీఫ్(BRS Cheif) మాజీ సీఎం కేసీఆర్(KCR) నేడు కాళేశ్వరం విచారణ కమిషన్(Kaleswaram Enquiry Commission) ముందు హాజరైన సంగతి తెలిసిందే. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(KLIP)లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ నేతృత్వంలోని పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh) గులాబీ బాసుకు 18 ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణలో అవకతవకలను విచారిస్తోంది.

అందులో భాగంగా నేడు కేసీఆర్ హైదరాబాద్‌లోని BRK భవన్‌లో 50 నిమిషాల పాటు కమిషన్‌ ముందు హాజరైన కేసీఆర్.. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రాజెక్ట్ రీడిజైన్, నీటి లభ్యత, సాంకేతిక అంశాలు, ఆర్థిక నిర్ణయాలు, అనుమతులపై కమిషన్ 18 ప్రశ్నలు అడగగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నీటి లభ్యత ఆధారంగా చేపట్టినట్లు తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్యల కారణంగా మేడిగడ్డకు స్థలం మార్చినట్లు వివరించారు. ఇది కేంద్ర జల సంఘం(CWC), మహారాష్ట్ర అభ్యంతరాల వల్ల తీసుకున్న సాంకేతిక నిర్ణయమన్నారు. బ్యారేజీల స్థల ఎంపిక, అన్నారం, సుందిల్లా బ్యారేజీల డిజైన్ మార్పులు వంటివి ఇంజనీర్ల సలహాలు, WAPCOS సిఫార్సుల మేరకు జరిగాయని.. ఈ నిర్ణయాలన్నీ కేబినెట్, ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

బ్యారేజీల్లో నీటి నిల్వపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ప్రాజెక్ట్ నిర్మాణానికి అన్ని అనుమతులు (జల శక్తి మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం, జూన్ 2018లో) తీసుకున్నామని, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్, దాని కీలక అంశాలను వివరిస్తూ కేసీఆర్ ఒక నివేదికను కమిషన్‌కు సమర్పించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్‌కు అందజేశారు.

Next Story