- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటితో ముగియనున్న సీఎం విదేశీ పర్యటన !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. రేపు ఆయన హైదరాబాద్ కు తిరిగిరానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా నుంచి పలువురు పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో చేసిన విదేశీ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి విజయవంతంగా ముగించారు. ప్రస్తుతం సీఎం పర్యటన సౌత్ కొరియాలో కొనసాగుతుతుంది. శనివారం నాడు అమెరికా పర్యటన ముగించుకొని కొరియాకు వెళ్లారు. అయితే గత కొన్ని రోజులుగా సీఎం విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. విదేశాల్లో జరుగుతున్న సమావేశాల్లో.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉండే అవకాశాలు, వాటికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి సీఎం వారికి వివరించారు. ఈ పర్యటనలో సీఎం తో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిణ్ రెడ్డి తదితరులు సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికే వరంగల్ లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో సౌత్ కొరియా నుంచి పెట్టుబడులు రాబట్టారు. దీంతో పాటు కొరియాలోని పలు వ్యాపార కంపెనీలు, వాణిజ్య సమూహాల ప్రతినిధులతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీ హ్యుందాయ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. దీంతో భారత్ లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ద్వారా మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు పెట్టుబడులు పెడతామని హ్యుందాయ్ ప్రతినిధులు చెప్పినట్లు సీఎం బృందం తెలిపారు. ఇంకా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలతో కూడా సీఎం బృందం సమావేశమైనట్లు అధికారులు వెల్లడించారు.






