- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGSRTC: ఆర్టీసీకి కాసుల వర్షం.. సంక్రాంతి ఆదాయం రూ.112.16 కోట్లు
సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను నడిపించడం ద్వారా రూ.112.16 కోట్ల ఆదాయం పొందింది. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు అధికారులు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను భారీగా పెంచడంతో ఆదాయం భారీగా వచ్చింది. గత సంక్రాంతి పండుగ సందర్భంగా 4,962 ప్రత్యేక బస్సులను నడపగా, రూ.98.49 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 5,806 ప్రత్యేక బస్సులను నడిపి రూ.112.16 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 844 ప్రత్యేక బస్సులను నడిపించారు. దీంతో ఈ ఏడాది సంక్రాంతికి రూ.14 కోట్లు అదనంగా వచ్చినట్టు ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
సంక్రాంతి పండగకు మూడు, నాలుగు రోజుల ముందు 10,11,12,13 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరిగి 16, 17,18 తేదీల్లో పట్టణాలకు చేరుకునే సమయంలో కూడా రద్దీ బాగా ఉన్నట్టు ఆర్టీసీ ఉన్నతాదికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు సుమారుగా 5 లక్షల మంది వెళ్లవచ్చని, తెలంగాణ 32 జిల్లాలకు సుమారు 3.50 లక్షల మంది వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణ కంటే ఏపీఎస్ ఆర్టీసీ ఎక్కువ బస్సులను కేటాయించినప్పటికీ అక్కడి ప్రజలు తెలంగాణ బస్సుల్లోనే ప్రయాణిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో అధికంగా మహిళే
రాష్ర్టంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో పేద, మధ్యతరగతి మహిళలంతా ప్రైవేటు వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులపై గమ్యస్థానాలకు చేరుకున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించింది. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేశారు. జనవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడిపించారు.






