- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGSRTC: ఐటీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 275 ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తున్నాయ్..
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఐటీ కారిడార్‌లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సుల (Electric buses)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్ర క్యాంపస్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఐటీ సంస్థల ప్రతినిధులతో సమావేశంలో వీసీ సజ్జనర్ (Sajjanar) మాట్లాడుతూ.. (IT Corridor) ఐటీ కారిడార్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ఉద్యోగులకు క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఐటీ కంపెనీలకు అద్దెకు బస్సులను ఇచ్చే సదుపాయాన్ని కల్పించామన్నారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మెట్రో డీలక్స్ బస్సులను అద్దెకు ఇస్తున్నామని, ఐటీ సంస్థలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఐటీ సంస్థ కూడా ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని, ఉద్యోగులకు ఆ దిశగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునే ఉద్యోగులకు ప్రోత్సహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో ఐటీ కారిడార్‌లో అందిస్తోన్న రవాణా సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించారు.






