- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGPSC: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ (Telangana)లో గ్రూప్-2 పరీక్ష ఫలితాలు (Group-2 Exam Results) విడుదల (Release) అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష (Group -2 Exam) ఫలితాలు విడుదల (Results Release) అయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ (TGPSC Chairman) బుర్రా వెంకటేశం (Burra Venkatesham) ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్ తో పాటు ఫైనల్ కీ (Final Key) ని కూడా బయట పెట్టారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్స్ (OMR Sheets) ను టీజీపీఎస్సీ వెబ్ సైట్ (TGPSC Website) ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. తెలంగాణలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2022లో నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ పరీక్ష కోసం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 15, 16 తేదీలలో ఎగ్జామ్ నిర్వహించగా.. ఈ పరీక్షకు 2.49 లక్షల మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
ఇందులో 2.36 లక్షల మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (Ranking List) ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలల్లో టాపర్ కు అత్యధికంగా 447 మార్కులు వచ్చాయి. కాగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం గ్రూప్-1 ఫలితాలను విడుదల చేయగా.. ఇవాళ గ్రూప్-2 ఫలితాల జాబితాను వెబ్ సైట్ లో పెట్టారు. దీంతో పాటు ఈ నెల 14న గ్రూప్-3 ఫలితాలను, ఈ నెల 20 న హస్టల్ వెల్‌ఫేర్ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసి పెట్టుకున్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో నోటిఫికేషన్లు విడుదల చేసి, వెను వెంటనే పరీక్షలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ అనంతరం ఆర్థిక శాఖ ఆమోదం పొందిన మరికొన్ని ఉద్యో్గాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. రాబోయే నోటిఫికేషన్లకు సిద్దంగా ఉండాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సహా పలు బోర్డులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు పడే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
గ్రూప్ -2 ఫలితాల్లో టాప్ 10 అబ్బాయిలే:
గ్రూప్ 2 ఫలితాల్లో ఈ సారి టాప్ 10 ర్యాంకులు పొంది అబ్బాయిలు సత్తా చాటారు.
1.నారు వెంకట హర్షవర్దన్ (447.088 మార్కులు)
2. వడ్లకొండ సచిన్ (444.754 మార్కులు)
3. బి మనోహర్‌రావు (439.344 మార్కులు)
4. శ్రీరామ్ మధు (438.972 మార్కులు)
5. చింతపల్లి ప్రీతమ్ రెడ్డి (431.102 మార్కులు)
6. అఖిల్ ఎర్రా (430.807 మార్కులు)
7. గొడ్డేటి అశోక్ (425.842 మార్కులు)
8. చిమ్ముల రాజశేఖర్ ( 423.933 మార్కులు)
9. మేకల ఉపేందర్ (423.119 మార్కులు)
10. కరింగు నరేష్ (422.989 మార్కులు)






