- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGPSC: ఓటీఆర్ అప్డేషన్ గడువు పొడిగింపు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమమ్యే అభ్యర్థులకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును వచ్చే నెల మార్చి 25 వరకు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమమ్యే అభ్యర్థులకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) అప్‌డేట్ చేసుకునే గడువును వచ్చే నెల మార్చి 25 వరకు పొడిగిస్తున్నట్లు టీజీపీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశమని, దీని తర్వాత మళ్ళీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో నింపే సమాచారానికి ఓటీఆర్ డేటానే ప్రాథమిక ఆధారం అవుతుందని పేర్కొంది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా గడువు ముగియడానికి ముందే వివరాలను సరిచూసుకుని, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఇప్పటివరకు ఓటీఆర్ అప్డేషన్ పూర్తి చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషన్ కోరింది.






