- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGPSC: గ్రూప్-1 పై టీజీపీఎస్సీ అప్పీల్
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్-1 ఫలితాల విషయంలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టు (TG High Court) సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ (TGPSC) డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ ఏడాది మార్చి 10న వెలువరించిన గ్రూప్-1 (Group-1) తుది ఫలితాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు, మార్కుల జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 9వ తేదీన తీర్పు ఇచ్చింది. జవాబు పత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలని అది కుదరని పక్షంలో తిరిగీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ రెండు ప్రక్రియలు పూర్తి చేయడానికి 8 నెలల గడువు విధించింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఇవాళ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. ఇక్కడా న్యాయం జరక్కుంటే సుప్రీంకోర్టుకూ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఫలితాల్లో తమకు అన్యాయం జరిగిదని వాదించిన అభ్యర్థులు స్వాగతించగా ర్యాంకులు సాధించిన అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తిరిగి మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని మెజారిటీ అభ్యర్థులు డిమాండ్ చేయగా తమకు అన్యాయం చేయవద్దని ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లడంతో గ్రూప్-1 వివాదం ఏ మలుపు తిరుగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.






