గిరిజన విద్యార్థి హత్య కేసు.. బాధిత కుటుంబానికి పరిహారంపై TGHRC కీలక ఆదేశాలు జారీ

by Ramesh Naini |

ఖమ్మం గిరిజన సంక్షేమ వసతి గృహంలో జరిగిన పదేళ్ల దేవత్ జోసెఫ్ హత్య కేసులో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక నిర్ణయం తీసుకుంది.

గిరిజన విద్యార్థి హత్య కేసు.. బాధిత కుటుంబానికి పరిహారంపై TGHRC కీలక ఆదేశాలు జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మం గిరిజన సంక్షేమ వసతి గృహంలో జరిగిన పదేళ్ల దేవత్ జోసెఫ్ హత్య కేసులో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణలో బాధిత బాలుడి మరణం ప్రభుత్వ వసతి గృహ అధికారుల నిర్లక్ష్యంతో చోటుచేసుకున్నదని కమిషన్ స్పష్టం చేసింది. 05.12.2025 తేదీతో HRC No.4543/2021లో ఇచ్చిన ఆదేశంలో, TGHRC ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని కమిషన్, జోసెఫ్ కుటుంబం దయనీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి రెండు ప్రధాన సిఫార్సులు చేసింది.

బాలుడి తల్లి చెవిటి-మూగదనం సమస్యతో బాధపడుతుండటం, అస్థిర ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుండటం, కుమార్తెతో పాటు వృద్ధ అత్తను పోషించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో లాస్ట్ గ్రేడ్ కేటగిరీలో రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం అవసరమని కమిషన్ పేర్కొంది. ఈ చర్యలు మానవతా దృక్పథంతో, బాధిత కుటుంబ గౌరవం, మౌలిక హక్కులను కాపాడడంలో భాగంగా భావించాలని కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించింది. ఈ సిఫార్సులను ఆరు నెలల్లో అమలు చేసి, అమలు నివేదికను కమిషన్‌కు సమర్పించాలని TSHRC ఆదేశించింది.

Next Story