TG TET-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల..

by Ramesh Naini |   (  Updated:2025-12-16 08:02:34  IST  )

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-జనవరి 2026)కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది.

TG TET-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET-జనవరి 2026)కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలను 2026 జనవరి 3 నుంచి జనవరి 20 వరకు మొత్తం 9 రోజుల పాటు 15 సెషన్లలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్‌లో భాగంగా ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. రెండో సెషన్‌లో మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 4:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

TG TET-2026కు దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ పరీక్ష షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు. పరీక్షల తేదీలు, సెషన్ల వివరాలతో కూడిన పూర్తి షెడ్యూల్‌ను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, TG TET చైర్మన్ తాజాగా ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ముందస్తుగా పరీక్షకు సిద్ధమవ్వాలని, హాల్ టికెట్‌, ఇతర సూచనలను గమనించాలని అధికారులు సూచించారు.

Next Story