- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గురుకుల ప్రవేశాలకు ముగిసిన టీజీ సెట్-2026.. 94.93 శాతం హాజరు నమోదు
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ సెట్-2026 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన టీజీ సెట్–2026 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 492 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా, మొత్తం 1,72,842 మంది విద్యార్థులు హాజరయ్యారని టీజీ సెట్–2026 చీఫ్ కన్వీనర్, టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఎస్. కృష్ణ ఆదిత్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీజీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీఆర్ఈఐఎస్, ఎంపీజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థల పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకూ, అలాగే 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకూ ఈ పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
మొత్తం 1,82,061 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, అందులో 1,72,842 మంది (94.93 శాతం) పరీక్షకు హాజరయ్యారని, 9,219 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ అధిక శాతం హాజరు గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశం పొందాలనే విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తిని స్పష్టంగా ప్రతిబింబిస్తోందని ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు. పరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు సహకరించిన జిల్లా అధికారులు, పరీక్షా కేంద్రాల సిబ్బంది, పోలీసు శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






