TG: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మళ్లీ తెర మీదకు జిల్లాల పునర్విభజన, 17కు తగ్గనున్న జిల్లాలు?

by Disha Web Desk 1 |
TG: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మళ్లీ తెర మీదకు జిల్లాల పునర్విభజన, 17కు తగ్గనున్న జిల్లాలు?
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కొత్త జిల్లాల విభజనపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి రావడంతో తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ అంశం తెర మీదకు వచ్చింది. ఈ మేరకు ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసి జిల్లాలను కుదిస్తామని ఆయన గతంలో తెలిపారు. కాగా, ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు 17కు తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలతోనూ చర్చించనుంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Next Story