వాహన తనిఖీలలో బయటపడ్డ కంట్రీ మేడ్ పిస్టల్..

by Disha Web Desk 23 |
వాహన తనిఖీలలో బయటపడ్డ కంట్రీ మేడ్ పిస్టల్..
X

దిశ,పేట్ బషీరాబాద్: దేశీయ తుపాకీతో వెళ్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కంట్రీ మేడ్ గన్ తో పాటుగా మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు జీడిమెట్ల పోలీసులు. ఎన్నికల నేపథ్యంలో జీడిమెట్ల పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ గ్రామం అయోధ్య నగర్ కు చెందిన వంశీకృష్ణ గౌడ్ తన యాక్టివా వాహనంపై వెళ్తుండగా పోలీసులు ఆపి ప్రశ్నించారు. ఈ క్రమంలో అతను అనుమానాస్పదంగా కనిపించడంతో వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో వాహనంలో దేశీయ గన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వంశీకృష్ణను అదుపులోకి తీసుకొని పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ఆయుధాల వ్యాపారం..

ఆయుధాలు అమ్మకం ద్వారా భారీగా డబ్బు సంపాదించవచ్చని ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మధ్యప్రదేశ్ కు చెందిన విశాల్ యాదవ్ అనే వ్యక్తి వంశీకృష్ణ కు చెప్పడంతో అతను నగరంలో అవసరమైన వారికి ఆయుధాలు విక్రయించేందుకు ఒప్పుకున్నాడు. ఒక్కో గన్ కోసం 50 వేల రూపాయలు చెల్లించాల్సిందిగా విషయాలు యాదవ్ చెప్పడంతో వంశీకృష్ణ గౌడ్. 19 వేల రూపాయలను ఆన్లైన్ ద్వారా చెల్లింపు చేశాడు. మార్చి 6న వరంగల్ కాజీపేట కు వచ్చిన విశాల్ యాదవ్ కు మిగిలిన డబ్బులు చెల్లించి వంశీకృష్ణ గౌడ్ మూడు లైవ్ రౌండ్ లతో కూడిన దేశీయ గన్ను తీసుకొని ద్విచక్ర వాహనంపై కాజీపేట నుంచి నగరానికి వచ్చాడు. అప్పటి నుంచి వంశీకృష్ణ తాను తీసుకొచ్చిన గన్ను రూ. రెండు లక్షల తో పాటుగా ఒక్కో బుల్లెట్ ఎనిమిది వేలకు అమ్మేందుకు ప్రణాళిక రూపొందించాడు. యాక్టివా పై కుత్బుల్లాపూర్ నుంచి బాలానగర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వంశీకృష్ణను పోలీసులు ఆపి తనిఖీ చేయగా విషయం బయటపడింది.

Next Story

Most Viewed