- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న TG మంత్రి
by Gantepaka Srikanth |
చిన్న చిన్న పదవుల్లో ఉన్న వారు కూడా చికిత్స కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళ్తున్న వేళ... సాక్షాత్తు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా వ్యవహరించిన తీరు వీఐపీలకు ఆదర్శంగా నిలిచింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: చిన్న చిన్న పదవుల్లో ఉన్న వారు కూడా చికిత్స కోసం కార్పొరేట్ హాస్పిటల్స్‌కు వెళ్తున్న వేళ... సాక్షాత్తు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా వ్యవహరించిన తీరు వీఐపీలకు ఆదర్శంగా నిలిచింది. ఆరోగ్యశాఖ మంత్రి జ్వరంతో బాధపడుతూ మంగళవారం నిమ్స్‌లో అడ్మిట్ అయ్యారు. నిమ్స్ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప నేతృత్వంలోని డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. పూర్తిగా కోలుకోవడంతో బుధవారం ఆయనను నిమ్స్ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈ విధంగా ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మంత్రి భరోసా కల్పించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో చక్కని వైద్యం అందుతుందని.. సేవలను సద్వినియోగం చేసుకునాలనే సందేశమిచ్చారని వైద్యులు పేర్కొంటున్నారు.
Next Story






