TG: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల అప్డేట్

by Gantepaka Srikanth |

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది.

TG: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల అప్డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13వ తేదీ నుండి 21వ తేదీ వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు నేటినుంచి ఈ నెల 20 వరకు ఫీజు చెల్లించేలా ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 నుండి 12 వరకు, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుండి 25 వరకు రెండు సెషన్లలో నిర్వహించునున్నారు. మే 26న ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. మే 28న ఎన్విరాన్ మెంట్ పరీక్ష ఉదయం పది నుండి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నారు.


రీకౌంటింగ్, వెరిఫికేషన్..

ఈ నెల 13 నుంచి 20 వరకు రీకౌంటింగ్ కు రూ.100, రీ వెరిఫికేషన్ కోసం రూ. 800 ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు తమ కాలేజ్ లాగిన్ నుంచి షాట్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఏమైనా సందేహాలుంటే helpdesk-ie-telangana.gov.in వెబ్సైట్ ను సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది. పరీక్షల్లో ఫెయిలైన లేదా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యే వాళ్లకి 14416 నంబర్ కి కాల్ కౌన్సెలింగ్ తీసుకునేలా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.

Next Story