- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీ ఐసెట్- 2026 నోటిఫికేషన్ విడుదల.. ఈ నెలలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఐసెట్ -2026) నోటిఫికేషన్ విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఐసెట్ -2026) నోటిఫికేషన్ విడుదలైంది. శుక్రవారం మహాత్మా గాంధీ వర్సిటీ వైస్ ఛాన్సలర్, టీజీ ఐసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ ప్రొఫెసర్ అలువాల రవి కలిసి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఆలస్య రుసుము లేకుండా మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఐసెట్ పరీక్ష మే 13, 14 తేదీల్లో జరగనున్నాయి. పరీక్షను ప్రతిరోజూ రెండు సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (సీబీటీ) నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 10 నుండి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 550, ఇతర అభ్యర్థులకు రూ. 750 గా నిర్ణయించారు. అభ్యర్థులు ఈ ఫీజును టీజీ ఆన్‌లైన్ సెంటర్లు, డెబిట్/క్రెడిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం https://icet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కన్వీనర్ సూచించారు. దరఖాస్తుదారులు ప్రవేశ సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలని స్పష్టం చేశారు.






