- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG High Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. హైకోర్టులో విచారణ వాయిదా
కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల భూమిపై హెచ్‌సీయూ (HCU), తెలంగాణ సర్కార్ (Telangana Government)కు మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల భూమిపై హెచ్‌సీయూ (HCU), తెలంగాణ సర్కార్ (Telangana Government)కు మధ్య వివాదం తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవలే కంచ గచ్చిబౌలి భూములను టీజీఐఐసీకి కేటాయింపు, టీజీఐఐసీకి కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అదేవిధంగా ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ.. వట ఫౌండేషన్ (Vata Foundation) అనే స్వచ్ఛంద సంస్థతో పాటు మరో ముగ్గురు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయా పిటిషన్లపై విచారణను వేసవి సెలవుల తర్వాత వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి పేర్కొన్నారు.






