- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG High Court: రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై హెచ్‌సీయూ, తెలంగాణ సర్కార్‌కు మధ్య వివాదం తారా స్థాయికి చేరిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli)లోని 400 ఎకరాల భూమిపై హెచ్‌సీయూ (HCU), తెలంగాణ సర్కార్ (Telangana Government)కు మధ్య వివాదం తారా స్థాయికి చేరిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూపై ఇవాళ తాజాగా తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ.. వట ఫౌండేషన్ (Vata Foundation) అనే స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని పటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. రేపు విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే ఆ భూములు మావంటే.. మావని అటు రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) పరస్పర వాదనకు దిగాయి. భూములను వేలం వేసేందుకు చదును చేసేందుకు ప్రయత్నించగా.. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇక విపక్ష నాయకులు వారి పోరాటానికి మద్దతుగా ప్రభుత్వంపై మాటల తూటాలు పేల్చుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కంచె గచ్చిబౌలి భూముల వివాదం చర్చనీయాంశంగా మారింది.
కాగా, వాస్తవానికి కంచె గచ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల భూమిని 2004లో అప్పటి చంద్రబాబు సర్కార్ (Chandrababu Government) ఐఎంజీ (IMG) అనే కంపెనీని కట్టబెట్టింది. ఆ క్రమంలోనే, అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి రావడంతో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy), ఐఎంజీ (IMG) కంపెనీకి సామర్థ్యం లేదని.. అదో బోగస్ కంపెనీ అంటూ కంచ గచ్చిబౌలి భూముల కేటాయింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐఎంజీ (IMG) కంపెనీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. 21 ఏళ్ల సుధీర్ఘ వాదోపవాదాల అనంతరం ఆ భూములు ప్రభుత్వానివేనంటూ ఇటీవలే ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే అవే 400 ఎకరాల భూములను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ (TGIIC)కి కేటాయిస్తూ.. పరిశ్రమల ఏర్పాటుకు విక్రయించాలని నోటిఫికేషన్ (Notification) జారీ చేసింది. అయితే, తాజాగా ఆ భూములపైనే వట ఫౌండేషన్ (Vata Foundation) అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ 400 ఎకరాల భూమిపై కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతోందనే విషయంపై అటు విద్యార్థులు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్లోనే ఉత్కంఠ నెలకొంది.






