- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt.: ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ కంప్లీట్.. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన నిజామాబాద్
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ దాదాపుగా ముగిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ దాదాపుగా ముగిసింది. ప్రభుత్వం 8,322 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వీటి ద్వారా 53.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో దొడ్డు రకం 29.51 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, సన్నాలు 23.5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. రైతులకు రూ. 11, 889 కోట్ల చెల్లింపులు చేసింది. ఇప్పటికే ప్రభుత్వం దాదాపు అన్ని జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను మూసివేసింది. కొత్తగూడెం, ఖమ్మం, మెదక్ జిల్లాలో ఉన్న సెంటర్లను మరో రెండు రోజుల్లో మూసివేయనున్నట్లు తెలిసింది. అయితే సేకరించిన ధాన్యంలో 47 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వం సీఎంఆర్ కోసం మిల్లులకు తరలిచింది. మిగతా ధాన్యం సమీపంలోని గోదాముల్లో భద్రపరిచింది. ముందు సీఎంఆర్ చేసిన వాటిని అప్పగిస్తే రెండో విడుత సీఎంఆర్‌కు తరలిస్తామని పౌరస రఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి.
కాగా, గత రబీ సీజన్ కు సంబంధించి 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందుకు సంబంధిం. రూ. 9,334 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ సీజన్ లో మరో 7లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువగా కొనుగోలు చేసింది. వానాకాలంలో రాష్ర్ట వ్యాప్తంగా 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, దాదాపు 150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 90 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయాలని భావించి రూ. 20వేల కోట్లు కేటాయించింది. అయితే ఈసారి మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు పోటాపోటీగా ధాన్యం కొనుగోలు చేయడంతో ప్రభుత్వ కేంద్రాలకు అశించిన మేరకు ధాన్యం రాలేదు. ప్రైవేటు వ్యాపారులు సుమారుగా 45లక్షల మెట్రిక్ కొనుగోలు చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యంసేకరణ ఇలా..
కొనుగోలు కేంద్రాలు: - 8,322
సేకరించిన ధాన్యం: - 53. 04 లక్షల మెట్రిక్ టన్నులు
దొడ్డు రకం: - 29. 51 లక్షల మెట్రిక్ టన్నులు
సన్న రకాలు: - 23. 52 లక్షల మెట్రిక్ టన్నులు
రైతులకు చెల్లించిన డబ్బు: - రూ. 11, 889 కోట్లు
ఫస్ట్ ప్లేస్‌లో నిజామాబాద్
ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా మొదటి స్ధానంలో నిలిచింది. ఇక్కడ 4.91లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఆ తర్వాత కామారెడ్డిలో 4.31లక్షల మెట్రిక్ టన్నులు, జగిత్యాలలో 3.60 లక్షల మెట్రిక్ టన్నులు, పెద్దపల్లిలో 2.97లక్షల మెట్రిక్టన్నులు, మెదక్ లో 2.91లక్షల మెట్రిక్ టన్నులు, నల్లగొండలో 2.73లక్షల మెట్రిక్ టన్నులు, కరీంనగర్ లో 2.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. మిగతా జిల్లాలో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1.50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి.






