- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG BJP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు.. ఫస్ట్ రియాక్షన్ ఇదే!
తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావు (Naraparaju Ramchander Rao) పేరు ఖరారైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచందర్ రావు (Naraparaju Ramchander Rao) పేరు ఖరారైంది. ఈ మేరకు నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం నుంచి ఆయనకు ఆదేశాలు అందాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు రామచందర్ రావు రాష్ట్ర అధ్యక్షుడిగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో తొలిసారిగా మాట్లాడుతూ.. ఎన్నిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఏది ఏమైనా.. తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు బీజేపీ అధిష్టానానికి పత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్నవాళ్లు, పెద్దవాళ్లు, నాయకులు, కార్యకర్తలు అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని పని చేస్తానని అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానని రామచందర్ రావు స్పష్టం చేశారు.
Next Story






