- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad : హైదరాబాద్‌లో ఉగ్రవాదులు?
హైదరాబాద్(Hyderabad)లో ఉగ్రవాదులు(Terrorists) గాని, స్లీపర్ సెల్స్(Sleeper Cells) గాని ఉన్నారా? ప్రస్తుతం నగర వాసులను ఈ అనుమానం భూతంలా వెంటాడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లో ఉగ్రవాదులు(Terrorists) గాని, స్లీపర్ సెల్స్(Sleeper Cells) గాని ఉన్నారా? ప్రస్తుతం నగర వాసులను ఈ అనుమానం భూతంలా వెంటాడుతోంది. తాజాగా నేడు తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి(DGP Jithendar Reddy) చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నట్టు కనిపిస్తోంది. శుక్రవారం తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు సమాచారం ఉందని, వీరిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు ప్రకటించారు.
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల(Bharat-Pak Conflicts) నేపథ్యంలో.. ఢిల్లీలో నిన్న ఇద్దరు ISI ఏజెంట్లను అరెస్టు చేసి, ISI స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కూడా స్లీపర్ సెల్స్, ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు, అక్రమ ఇమ్మిగ్రెంట్లకు సహకారం అందించేవారని గుర్తిస్తున్నామని అన్నారు. ఈ వేటలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు(SIT) తీవ్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో గతంలో హర్కత్-ఉల్-జిహాద్-అల్ ఇస్లామీ(HuJI), ఇండియన్ ముజాహిదీన్(IM) లాంటి సంస్థలతో సంబంధాలు ఉన్నవారిపై నిఘా ఉందని జితేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని సరిహద్దు ప్రాంతాలు, ఓల్డ్ సిటీలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఇంటెలిజెన్స్ బ్యూరో(IB), రాష్ట్ర ఇంటెలిజెన్స్ శాఖలతో కలిసి అనుమానితుల ఫోన్ నంబర్లు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను ట్రాక్ చేస్తున్నట్టు ప్రకటించారు. అక్రమ ఇమ్మిగ్రెంట్లను గుర్తించేందుకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్‌లను పరిశీలిస్తున్నామని తెలియజేశారు. హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.






