లక్షెట్టి‌పేట‌లో టెన్షన్.. టెన్షన్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పంచాయితీ

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతుండగా మంచిర్యాల (Manchiryal) జిల్లా లక్షెట్టిపేట (Lakshettipet)లో టెన్షన్ వాతావరణ నెలకొంది.

లక్షెట్టి‌పేట‌లో టెన్షన్.. టెన్షన్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పంచాయితీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాతంగా కొనసాగుతుండగా మంచిర్యాల (Manchiryal) జిల్లా లక్షెట్టిపేట (Lakshettipet)లో టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. లక్షెట్టిపేటలోని 9, 10వ వార్డు పరిధిలోని ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లో ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా పార్టీ కండువాలు కప్పుకుని పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో తిరుగుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది.

ఓ దశలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులకు సిద్ధపడటంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. రెండు పార్టీల ముఖ్య నాయకులతో మాట్లాడి.. వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపివేయడంతో గొడవ సద్దుమణిగింది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్దే ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సామాన్య ఓటర్లు కొంత ఆందోళనకు గురయ్యారు.

Next Story