- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CMs Visit Davos : దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
దావోస్(Davos)లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF)-2025 సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రా(Telugu States)ల సీఎం(CMs)లు హాజరుకాబోతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : దావోస్(Davos)లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF)-2025 సదస్సుకు రెండు తెలుగు రాష్ట్రా(Telugu States)ల సీఎం(CMs)లు హాజరుకాబోతున్నారు. ఒకప్పుడు టీడీపీలో గురుశిష్యులుగా ప్రచారం పొందిన ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy)లు ఇప్పుడు తమతమ రాష్ట్రాలకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ వేదికగా పోటీ పడనుండటం ఆసక్తికర పరిణామం.
బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో ఏపీకి భారీ పెట్టుబడులు సాధించేందుకు చంద్రబాబు నాయుడు, రైజింగ్ తెలంగాణ పేరుతో తెలంగాణకు పెట్టుబడుల సాధనకు రేవంత్ రెడ్డిలు దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో వచ్చే ప్రపంచ వ్యాపార దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేవంత్, చంద్రబాబు దావోస్ పర్యటన చేస్తుండగా..వారిద్ధరూ అక్కడ కలుస్తారా...వేర్వేరుగా పెట్టబడుల సాధనలో ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.
ప్రతిపక్షాలు రేవంత్, చంద్రబాబుల దావోస్ పర్యటనపై డేగ కన్నుతో పరిశీలన చేస్తుండటం ఆసక్తికరం. వారిద్ధరి దావోస్ పర్యటన ప్రత్యేకతలు..విజయాలు, వైఫల్యాల తదితర అంశాలపై వారి అనుకూల, వ్యతిరేక సోషల్ మీడియా బృందాలు తమ పని తాము చేసేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న కేసీఆర్, జగన్ రెడ్డి దావోస్ పర్యటనకు దూరంగా ఉన్నారు. కాని చంద్రబాబు, రేవంత్ రెడ్డి మాత్రం విదేశీ పెట్టుబడుల సాధనకు దావోస్ సదస్సుకు హాజరవుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా రెండో ఏడాది దావోస్ సదస్సుకు హాజరవుతున్నారు. ఇప్పటికే సింగపూర్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బృందం అటు నుంచి దావోస్ బయలుదేరింది.
ఇక ఏసీ సీఎం చంద్రబాబు ఎన్డీఆర్ఎఫ్ వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి పాల్గొన్న అనంతరం సాయంత్రం ఢిల్లీ మీదుగా దావోస్ వెలుతారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెట్టుబడుల సాధనకు సీఎం చంద్రబాబు పలు దిగ్గజ సంస్థలతో పాటు గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఇప్పటికే ఏపీలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నాయి. ఇప్పటి వరకు రూ. 4 లక్షల కోట్ల కు పైగా పెట్టుబడులపై ఒప్పందాలు జరిగాయి. వీటిలో కొన్ని ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపనలు కూడా జరిగాయి.
దావోస్ లో అర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో పాటు బీపీసీఎల్, సోలార్ ఇంపల్స్, కోకాకోలా, వెల్ స్పన్, ఎల్ జి, కార్ల్స్ బర్గ్, సిస్కో, వాల్ మార్ట్ ఇంటర్ నేషనల్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ వంటి సంస్థల సీఈవోలతో, చైర్మన్ లతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థవంతమైన నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ప్రయత్నించనున్నారు.






